ఆర్ ఎస్ ఇ టి ఐ ఒక చూపులో -
ఆర్ ఎస్ ఈ టీ ఐ (గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ) అనేది కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్ ఓ ఆర్ డీ) చొరవతో ఏర్పాటైంది. ఇది కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్ ఓ ఆర్ డీ), జీ ఓ ఐ, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంకా స్పాన్సర్ బ్యాంకుల మధ్య ముక్కోణ భాగస్వామ్యంతో సేవలు అందిస్తుంది. స్వయం ఉపాధి/ఉపాధి కల్పన సంస్థలను గ్రామీణ యువత ఏర్పాటు చేసేందుకు అవసరమైన శిక్షణనిచ్చేందుకు బ్యాంకులు తమ లీడ్ జిల్లాలో కనీసం ఒక ఆర్ ఎస్ ఈ టీ ఐని తప్పకుండా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. స్వల్పకాలిక శిక్షణ, దీర్ఘకాలికంగా వ్యవస్థాపకులు తమ సంస్థను నిర్వహించుకోగలిగేలా చేయాలనే లక్ష్యంతో ఆర్ ఎస్ ఈ టీ ఐ కార్యక్రమం నడుస్తుంది. ఆర్ ఎస్ ఈ టీ ఐలు ప్రధానంగా 18-45 సంవత్సరాల మధ్య ఉన్న గ్రామీణ పేద యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు శిక్షణనిస్తున్నాయి. ఆర్ ఎస్ ఈ టీ ఐలు గ్రామీణ పేద యువత ఆకాంక్షలను గుర్తించడంతోపాటు వారికి సంబంధించిన రంగంలో, వ్యవస్థాపక నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నాయి. దీని ద్వారా వారిని లాభదాయకమైన వ్యవస్థాపకులుగా మార్చడంలో ఈ ఆర్ ఎస్ ఈ టీ ఐలు మార్గనిర్దేశకులుగా నిలిచాయి.
ఆర్ ఎస్ ఈ టీ ఐని 3 కమిటీలు నిర్వహిస్తాయి. అవి ఏంటంటే 1.ఆర్ ఎస్ ఈ టీ ఐలకు సంబంధించి జాతీయ స్థాయి సలహా కమిటీ(ఎన్ ఎల్ ఏ సీ ఆర్). దీనికి ఛైర్మన్‌గా ఎమ్ ఓ ఆర్ డీ కార్యదర్శి వ్యవహరిస్తారు. వీరి అధ్యక్షతన ఆరు నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. 2. ఆర్ ఎస్ ఈ టీ ఐలపై రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ (ఎస్ ఎల్ ఎస్ సీ ఆర్), ప్రధాన కార్యదర్శి (ఆర్ డీ), రాష్ట్ర ప్రభుత్వం (ఆరు నెలలకు ఒకసారి సమావేశం) 3. జిల్లా స్థాయి ఆర్ ఎస్ ఈ టీ ఐ సలహా కమిటీ (డీ ఎల్ ఆర్ ఏ సీ), డీ ఆర్ డీ ఏ డీ సీ /సీఈఓ అధ్యక్షతన (త్రైమాసిక సమావేశం)
ఎన్ ఏ సీ ఈ ఆర్ (నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సెలెన్సీ ఆఫ్ ఆర్ ఎస్ ఈ టీ ఐ) అనేది ఎమ్ ఓ ఆర్ డీ పరిధిలో పనిచేసే సంస్థ. ఇది ఎస్ డీ ఆర్( స్టేట్ డైరెక్టర్ ఆఫ్ ఆర్ ఎస్ ఈ టీ ఐ) సహాయంతో ఆర్ ఎస్ ఈ టీ ఐని పర్యవేక్షిస్తుంది. ఎస్ డీ ఆర్‌ను ఎమ్ ఓ ఆర్ డీ నియమిస్తారు. మేము ముఖ్య కార్యాలయం, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ డిపార్ట్‌మెంట్ నుంచి సంబంధిత రాష్ట్ర జోనల్ కార్యాలయం & ఎల్ డీ ఎమ్‌లు ఎన్ ఏ సీ ఈ ఆర్ / ఎమ్ ఓ ఆర్ డీ / సంబంధింత రాష్ట్ర ఎన్ ఆర్ ఎల్ ఎమ్/ ఎస్ ఎల్ బీ సీలతో అనుసంధానం చేసుకుంటూ ఆర్ ఎస్ ఈ టీ ఐని పర్యవేక్షిస్తున్నాము
జిఒఐ/ ఎంఓఆర్ డి అప్పగించినట్లుగా, మేము ప్రస్తుతం 43 ఆర్ ఎస్ ఇటిఐలను స్పాన్సర్ చేస్తున్నాము. 2024 మార్చి వరకు మా ఆర్ఎస్ఈటీఐలు సుమారు 3.41 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాయి, వీరిలో 2.46 లక్షలు (72.17%) సెటిల్ అయ్యాయి మరియు 1.24 లక్షలు (52.60%) వరుసగా 70% మరియు 50% సెటిల్మెంట్ & క్రెడిట్ లింకేజీ కోసం జాతీయ లక్ష్యానికి వ్యతిరేకంగా క్రెడిట్ లింక్ చేయబడ్డాయి. ఎస్ఓపీ ప్రకారం బీపీఎల్ అభ్యర్థులకు 70 శాతం శిక్షణ ఇవ్వడం తప్పనిసరి, ఇందుకోసం బీపీఎల్ అభ్యర్థులకు సంబంధించి శిక్షణ ఖర్చులను ఎంవోఆర్డీ రీయింబర్స్ చేస్తుంది.
ఎన్ ఏ సీ ఈ ఆర్, ఎన్ ఏ ఆర్, ఎన్ ఐ ఆర్ డీ&పీఆర్, ఎన్ ఏ బీ ఏ ఆర్ డీ, ఎమ్ ఓ ఆర్ డీ మొదలైన వాటితో అనుసంధానం చేసుకుంటూ ఎస్ ఓ పీ/కామన్ నార్మ్స్ నోటిఫికేషన్‌లు (సీ ఎన్ ఎన్) సమ్మతిని నిర్ధారించడం కోసం సంబంధిత జెడ్ ఓ, ఎల్ డీ ఎమ్ ద్వారా అన్ని ఆర్ ఎస్ ఈ టీ ఐలను హెచ్ ఓ - ఎఫ్ ఐ విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. ఆర్ ఎస్ ఈ టీ ఐలో శిక్షణ కోసం నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (ఎస్ ఎస్ క్యూ ఎఫ్) కింద ఉన్న కార్యక్రమాల్లో 61 శిక్షణా కార్యక్రమాలను ఎమ్ ఓ ఆర్ డీ ఆమోదించింది. ఎన్ ఎస్ క్యూ ఎఫ్ ఆమోదించిన ట్రేడింగ్ కోర్సులే కాకుండా ఎన్ ఏ బీ ఏ ఆర్ ఎస్, ఇతర ప్రభుత్వ విభాగాలు స్పాన్సర్ చేసే శిక్షణను కూడా ఆర్ ఎస్ ఈ టీ ఐ అందిస్తుంది.
సెటిల్‌మెంట్, క్రెడిట్ లింకేజీని పెంచడమే మా లక్ష్యం. మిగిలిన ప్రదేశాలలో భవనాన్ని పూర్తి చేయడంపై దృష్టి సారించాం. దీంతో, ప్రతి ఆర్ ఎస్ ఈ టీ ఐ మెరుగ్గా పనిచేసేందుకు, ఎస్ ఓ పీకి అనుగుణంగా తమకంటూ సొంత భవనాన్ని కలిగి ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మా ఆర్ ఎస్ ఈ టీ ఐని జిల్లా స్థాయిలో ఒక మోడల్ స్కిల్లింగ్ సెంటర్‌గా మార్చడమే మా ప్రయత్నం
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మా మొత్తం 43 ఆర్ ఎస్ ఈ టీ ఐలకు “ఏ ఏ” గ్రేడ్‌ని ప్రదానం చేసింది.
మా బ్యాంక్ నిర్వహిస్తున్న ఆర్ ఎస్ ఈ టీ ఐల వివరాలను ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి:-
Excel sheet attachment-1